నియోజకవర్గ అభివృద్ధి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తుంది

– ఎమ్మెల్యే ముఠా గోపాల్‌
నవతెలంగాణ- ముషీరాబాద్‌
ముషీరాబాద్‌ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తుందని బిఆర్‌ ఎస్‌ అభ్యర్థి ఎమ్మె ల్యే ముఠా గోపాల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని కవాడిగూడ డివిజన్‌లోని కుమ్మరి యువజన సంఘం నాయకులు బిఅర్‌ఎస్‌ పా ర్టీలో చేరారు. వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు అభ్యర్థి ముఠా గోపాల్‌, రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షుడు రాంబాబు యాదవ్‌, అనం తరం గాంధీనగర్‌ డివిజన్‌లోని బిఆర్‌ఎస్‌ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ. నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభి వద్ధి చేసినట్లు తెలిపారు. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందించానన్నారు. ప్రతి రోజు ప్రజలతో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూ ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు. నేను చేసిన అభివద్ధి అత్యధిక మెజా రిటీతో నన్ను గెలిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయ కులు ముఠా జై సింహ,కవాడిగూడ గాంధీ నగర్‌ డివిజన్‌ అధ్యక్షులు వల్లాల శ్యామ్‌ యాదవ్‌, రాకేష్‌ కుమార్‌, నాయకులు ముఠా నరేష్‌, ముచ్ఛాకుర్తీ ప్రభాకర్‌, బొట్టు శ్రీనివాస్‌, శంకర్‌ ముదిరాజ్‌, కరిక కిరణ్‌, తదితర నాయకులు పాల్గొన్నారు

Spread the love