నియోజకవర్గమే నా  దేవాలయం,ప్రజలే నా దేవుళ్ళు

– ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య
నవతెలంగాణ-ధర్మసాగర్
నియోజకవర్గమైన దేవాలయం ప్రజలే నా దేవుళ్ళని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు.ఆదివారం ధర్మసాగర్ మండల క్లస్టర్-2 ఆత్మీయ సమావేశం మండలంలోని కరుణాపురం గ్రామంలోని ఆర్కే గార్డెన్స్ లో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మునిగిల రాజు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొనగా విశిష్ట అతిథులుగా తెలంగాణ రాష్ట్ర శాసన మండలి డిప్యూటి చైర్మన్ బండ ప్రకాష్ పాల్గొని మాట్లాడారు. స్టేషన్గన్పూర్ నియోజకవర్గ  గడ్డ పై ఎగిరిదే గులాబీ జెండానే, కార్యకర్తలతో మమేకమయ్యందుకే ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని పార్టీ శ్రేణులకు సూచించారు.జూన్ 2 , 2023 నుండి పదివసంతాల తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నియోజకవర్గంలో 21 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఇందుకు ప్రతి కార్యకర్త ముందుకు రావాలని పిలుపునిచ్చారు.విశ్వాసం పొందిన పార్టీలనే ప్రజలు ఎన్నుకుంటారని టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే రాష్ట్ర అభివృద్ధి చెందిందన్నారు.గ్రామీణ ప్రాంతాలలో అన్ని మౌలికమైన వసతులతో కూడిన నాణ్యమైన జీవనాన్ని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ గారికే దక్కుతుందన్నారు. వ్యక్తి , సమాజ సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ గారి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. అనంతరం ఈ సందర్భంగా కార్యకర్తలతో సహా పంక్తి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిన్న కవిత రెడ్డి,జడ్పీటీసి పిట్టల శ్రీలత సత్యనారాయణ, మార్కెట్ వైస్ చైర్మన్ కాలేరు కరంచంద్, వైసిపి బండారు రవీందర్, మండల అధికార ప్రతినిధి రావుల వెంకటరెడ్డి, కర్ర సోమిరెడ్డి, బొడ్డు సోమయ్య,మండల ఇంచార్జ్ లు , ముఖ్య నాయకులు,సర్పంచులు, ఎంపీటీసీలు,ఇతర  ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు , నియోజకవర్గ కోఆర్డినేటర్స్,మండల కోఆర్డినేటర్స్, మహిళ నాయకులు , గ్రామాశాఖల అధ్యక్షులు మరియు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love