భగవద్గీత లాంటిది భారత రాజ్యాంగం

– ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించిన కలెక్టర్‌
నవతెలంగాణ-మెదక్‌
భారత రాజ్యాంగం భగవద్గీతలాంటిదని ప్రతి ఒక్కరు చదివి రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించు కుని ఆదివారం కలెక్టరేట్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా అధికారులు, ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించా రు. రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడు సమాజంలో జీవించడానికి సమాన హక్కులు, భాద్యతలు కల్పించిందని, నేడు వ్యవస్థ కూడా రాజ్యాంగానికి లోబడి నడుస్తున్నదన్నారు. ప్రతి సమస్యకు జవాబు దొరుకుతుందని, కాబట్టి ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని చదివి ఆకళింపు చేసుకోవాలని కోరారు. బలమైన దేశంగా ఉండడానికి కారణం మన రాజ్యాంగమేనని, రాజ్యాంగం దేశానికి రక్షణ కవచంలా పనిచేస్తుంద న్నారు. భారత దేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడానికి పౌరులంద రికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలతో స్వేచ్ఛను అంతస్తు (హౌదా) లోను, అవకాశములోను సమానత్వంను, చేకూర్చుటకు వారందరిలో వ్యక్తి గౌరవమును, జాతి ఐక్యమత్యను, అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాతత్వాన్ని పెంపొందదించుటకు సత్యనిస్థా పూర్వకంగా తీర్మానించుకోని మనం రూపొం దించుకున్న భారత రాజ్యాంగాన్ని 1949, నవంబర్‌ 26న మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకొన్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేముగా సమర్పించుకుంటున్నామని ఇందుకు కట్టుబడి ఉంటామని సత్యనిష్ట పూర్వకంగా ప్రమాణం చేస్తున్నా మని అందరి చేత ప్రమాణం చేయించారు. ఈనెల 30న జరిగే రాష్ట్ర శాసన సభ ఎన్నికలలో స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రమేష్‌, డిఆర్‌ఓ పద్మశ్రీ, కలెక్టరేట్‌ కార్యాలయ విభాగా ల అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రతిజ్ఞ చేశారు.

Spread the love