– కేవీపీఎస్ ఆవిర్భావ వేడుకల్లో టీ స్కైలాబ్ బాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజ్యాంగ లక్ష్యాలను రక్షించు కోవాల్సిన అవసరం, అందుకు పోరా డాల్సిన పరిస్థితి దేశంలో నెలకున్నదని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు తెలిపారు. సోమ వారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర రాష్ట్ర కార్యాలయం వద్ద కేవీపీఎస్ 25వ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సంఘం జెండాను ఆయన ఎగురవేశారు. జ్యోతిబాఫూలే, అంబే ద్కర్ చిత్రపటాలకు తెలంగాణ గిరి జన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ శ్రీరామ్ నాయక్, తెలంగాణ వ్యవ సాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్య క్షులు బుర్రి ప్రసాద్ పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం స్కైలాబ్ బాబు మాట్లాడుతూ రాజ్యా ంగాన్ని రద్దు చేసి దాని స్థానంలో మనుస్మృతిని ప్రవేశపెట్టేందుకు ఆర్‌ఎస్‌ఎస్ ఆదేశాలతో బీజేపీ సర్కార్ ప్రయత్నిస్తున్న దన్నారు. తద్వారా కుల అసమానతలు, వివక్ష యథాతథంగా కొనసాగించేందుకు కుట్రలు చేస్తున్న దని విమర్శించారు. ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన లక్ష్యాల సాధనకు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం పని చేస్తున్నదని తెలిపారు. అనతికాలంలోనే కుల వివక్షకు వ్యతి రేకంగా ఎన్నో పోరాటాలు నిర్వహిం చిందని వివరించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను సాధించుకున్నామ న్నారు. దళిత, గిరిజనుల జనాభా 30 శాతం ఉంటే.. కేవలం 4శాతం మాత్రమే నిధులు కేటాయిస్తున్న తరుణంలో 2004 నుంచి 2013 వరకు దశల వారి పోరాటాలు నిర్వ హించామని గుర్తు చేశారు. జనాభా దామాషా ప్రకారం బడ్జెట్‌లో నిధులు సమకూ ర్చేలా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని సాధించిందని తెలిపారు. దళితులకు స్మశాన వాటికల కోసం పోరాడి జీవో నెంబర్ 1235 ను సాధించిందన్నారు, దళితులకు 101 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వాలని జీవో నెంబర్ 342ను సాధించుకున్నామని తెలి పారు. కులాంతర వివాహాల ప్రోత్సా హానికి జీవో నెంబర్ 12 ప్రకారం రూ. 2,50 లక్షల చెల్లించే విధంగా పోరా డమన్నారు. రాష్ట్రంలో జరిగిన కుల దుర హంకార హత్యలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు నిర్వహించేది కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘమేనని చెప్పారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై 300 రెట్లు దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రావలసిన నిధులు రాకుండా నీతి అయోగ్ ముసుగు ధరించిందన్నారు. ఎస్సీ ఎస్టీ అత్యా చార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి పలుకుట్రలు చేసింద న్నారు. ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు, కేవీపీఎస్‌్ నగర అధ్యక్షులు ఎం దశరథ్, బుడగ జంగాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కడమంచి రాంబాబు మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్ బాలపీరు వివిధ ప్రజాసంఘాల రాష్ట్ర జిల్లా నాయకులు ప్రముఖ అంబేద్కర్ వాదీ డాక్టర్ స్వామి అల్వాల్, రిటైర్డ్ పంచాయతీ రాజ్ అధికారి ఇరిగి నర్సింగ రావు, రిటైర్డ్ ఇరిగేషన్ అధికారి ఎం డి రఫిక్, శ్రీరాములు, అశోక్ రెడ్డి, విజరు, మిస్రీన్, గోవర్ధన్, ఆర్. వెంకటేష్, రమేష్, నారాయణ, బి పవన్ తదితరులు పాల్గొన్నారు