రాజ్యాంగ హక్కులు న్యాయ సహాయం అరెస్ట్ కాబడిన వ్యక్తి గల హక్కులు అంశాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ప్రధాన జిల్లా న్యాయమూర్తి ఏ జయరాజు తెలిపారు. శనివారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో భువనగిరి సబ్ జైల్లో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరిలో న్యాయ సహాయానికై ప్రత్యేక న్యాయవాదులతో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం కార్యాలయం ఆరుగురు న్యాయవాదులతో సేవలు అందిస్తుందని, జిల్లాలోని జె. ఎం. ఎఫ్. సి కోర్టులలో న్యాయ సహాయ న్యాయవాదులు క్రిమినల్ కేసులలో న్యాయ సహాయం అందిస్తున్నారని తెలిపారు. ఖైదీలు మంచి ప్రవర్తనతో ఉండి నేర ప్రవృత్తి విడనాడే విదంగా మార్పు రావాలని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి వి. మాధవిలత, అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎన్. శ్యాం సుందర్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి. కవిత, భువనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి. హరినాథ్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎస్. జైపాల్, జైలు సూపరింటెండెంట్ నెహ్రు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్, న్యాయవాదులు, ఖైదీలు పాల్గొన్నారు.