32 గ్రామాలలో బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సెల్‌ టవర్స్‌ నిర్మాణం

– కలెక్టర్‌ ప్రియాంక అలా
నవతెలంగాణ-పాల్వంచ
బిఎస్‌ఎన్‌ఎల్‌ ద్వారా జిల్లాలో సెల్‌ సిగల్‌ కవరేజ్‌ లేని 32 గ్రామాలలో బిఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సెల్‌ టవర్స్‌ నిర్మించనున్నట్లు కలెక్టర్‌ డా.ప్రియాంక అలా తెలిపారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో నెట్‌ వర్క్‌ లేని గ్రామాల్లో సెల్‌ టవర్లు నిర్మాణంపై బీయస్‌ఎన్‌యల్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. సెల్‌ టవర్లు నిర్మాణానికి గుర్తించిన గ్రామాల నుండి 2 గుంటల భూమి టవర్స్‌ నిర్మించుటకు కేటాయింపు చేయాలని, బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులను కోరారు. జిల్లాలో 26 గ్రామాలలో రెవిన్యూ అధీనంలోని గ్రామం నుండి 2 గుంటల భూమిని కేటాయిచడం జరిగుతుందని చెప్పారు. 6 గ్రామాలు వ్యవసాయ శాఖ పరిధిలో ఉండడం వలన వ్యవసాయ అధికారులతో మాట్లాడి త్వరలో భూమి కేటాయింపు అయ్యేలా చర్యలు తీసుకుంటామనని చెప్పారు. ఈ సమావేశంలో డీఆర్వో రవీంద్ర నాధ్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ డీజీఎం నవీన, ఏజీఎం శ్రీనివాసరావు, ఎస్‌ డీఈ సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love