అజ్మీర్‌ దర్గా వద్ద త్వరలో తెలంగాణ భవన నిర్మాణం

– రాష్ట్ర హౌంశాఖ మంత్రి మహమూద్‌ అలీ
నవతెలంగాణ-ముషీరాబాద్‌
రాజస్థాన్‌లో ప్రసిద్ధిగాంచిన అజ్మీర్‌దర్గా వద్ద తెలం గాణ ప్రజల ఉపయోగార్థం మరో రెండు నెలల్లో తెలంగాణ భవన నిర్మాణ పనులు సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారని రాష్ట్ర హౌంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. ఆదివారం ముషీరాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్‌ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎడ్ల.హరిబాబు యాదవ్‌ ఆధ్వర్యంలో ఏక్‌ మినార్‌ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో రాజస్థాన్‌ అజ్మీర్‌ ”దర్గాకు చా దర్‌ సమర్పించే కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతి థిగా హాజరైన మహమూద్‌ అలీ, ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మె ల్యే ముఠాగోపాల్‌ తో కలిసి చాదరను అజ్మీర్‌ దర్గాకు తర లించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అన ంతరం హౌంశాఖ మంత్రి మాట్లాడుతూ… గంగా జమున నతైజిప్‌ వలే తెలంగాణ ప్రజలు కలిసి మెలిసి జీవిస్తున్నార న్నారు. కాంగ్రెస్‌, బిజేపీ పార్టీ నేతలు ప్రజల్లో చిచ్చుపెట్టి ఎన్నికల్లో ఓట్లు దండుకు నేందుకు తప్పుడు ప్రచారం చేస్తు న్నారన్నారు. ఆ రెండుపార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్‌ ను మూడవసారి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఎంపి బీబీ పాటిల్‌ మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం గా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ మాట్లాడుతూ ముషీరాబాద్‌లో హిందూ ము స్లీంలు ఐక్యంగా పండుగలను జరుపుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎడ్ల హరిబాబుయాదవ్‌ మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా ఆజ్మీర్‌ దర్గాకు చాదర్‌ను సమర్పిస్తున్నా మ ని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ సీని యర్‌ నాయకుడు ఎమ్మెన్‌ శ్రీనివాస్‌ రావు, యువజన విభా గం నగర నాయకుడు ముఠా జైసింహా, ముషీరాబాద్‌ బిఆర్‌ఎస్‌ బోలక్‌ పూర్‌ వై శ్రీనివాసరావు, ముషీరాబాద్‌ డివిజన్‌ అధ్యక్షుడు నర్సింగ్‌ ప్రసాద్‌, వై శ్రీనివాసరావు. గౌరీశంకర్‌ ఆలయ కమిటీ చైర్మెన్‌ శ్రీదరాచారి, డి.శివముదిరాజ్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love