రమేష్‌ను కొనసాగింపుపై ధిక్కార కేసు

నవతెలంగాణ-హైదరాబాద్‌
డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పదవిలో ఇన్‌చార్జిని నియమించరాదన్న ఉత్తర్వులను సస్పెండ్‌ చేసిన తర్వాత కూడా ఆయనను కొనసాగించడం కోర్టు ధిక్కారమవుతుందని, దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రమేష్‌రెడ్డిని ఇన్‌చార్జిగా నియమిస్తూ 2017లో ఇచ్చిన జీవోను హెల్త్‌ కేర్‌ రిఫామ్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ సవాల్‌ చేసింది. ఆ జీవోను హైకోర్టు ఇటీవల సస్పెండ్‌ చేసింది. అయినప్పటికీ ఆయననే ఆ పదవి నిర్వహిస్తున్నారంటూ హెల్త్‌ కేర్‌ రిఫామ్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిని జస్టిస్‌ ఎస్‌.నందా విచారించి ప్రతివాదులైన వైద్యారోగ్య శాఖలు, ఇన్‌చార్జిగా ఉన్న రమేష్‌రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.

Spread the love