కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలి

– ఉస్మానియా యూనివర్సిటీ కాంట్రాక్ట్‌ టీచర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ
– లిబర్టీలోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన
నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌
12 యూనివర్సిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ కాంట్రాక్ట్‌ టీచర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. శుక్రవారం హిమాయత్‌నగర్‌, లిబర్టీలోని డాక్టర్‌ బీఆర్‌. అంబేద్కర్‌ విగ్రహం ఎదుట కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు వెలిగించిన కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్‌ యాక్షన్‌ కమిటీ చైర్మెన్‌ డాక్టర్‌ ఎ.పరుశురాం, కన్వీనర్‌ డాక్టర్‌ డి.ధర్మతేజ మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌, పాలిటెక్నిక్‌ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ లెక్చర ర్లను రెగ్యులర్‌ చేశారనీ, యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను రెగ్యులర్‌ చేయకుండా విస్మరి ంచడం చాలా బాధాకరమన్నారు. తెలంగాణలో కాం ట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లతోనే యూనివర్సిటీ ఉన్నత విద్య సజావుగా సాగుతుందన్నారు. కాంట్రాక్ట్‌ అసిసె ్టంట్‌ ప్రొఫెసర్లు జీవో 16లో నియమ నిబంధన లను ఫుల్‌ ఫిల్‌ చేయడమేగాక యూజీసీ నిబంధనల మేరకు అన్ని విద్యార్హతలు గల 30 ఏండ్లుగా యూని వర్సిటీల్లో పని చేస్తున్నారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ పలు పలు దఫా లుగా ఇచ్చిన హామీల మేరకు తప్పకుండా రెగ్యు లర్‌ చేయాలని కోరారు. ఈ విష యంలో సీఎం కేసీఆర్‌ చొరవ తీసుకుని యూనివర్సిటీ కాంట్రాక్ట్‌ టీచర్లందరినీ రెగ్యులర్‌ చేస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. లేదంటే రాష్ట్రం లోని 12 యూని వర్సిటీల కాంట్రాక్ట్‌ అధ్యాపకులు ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కమిటీ నాయకులు డాక్టర్‌ పరమేశ్వర్‌, డాక్టర్‌ వేల్పుల కుమార్‌, డాక్టర్‌ ఉపేందర్‌, డాక్టర్‌ ఆనంద్‌, డాక్టర్‌ పరంధాములు, డాక్టర్‌ వినీత, డాక్టర్‌ ప్రియ, డాక్టర్‌ అనిత రంగశ్రీ, డాక్టర్‌ కవిత, తదితరులు పాల్గొన్నారు.

Spread the love