కాంట్రాక్టు ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలి..

నవతెలంగాణ-భిక్కనూర్
తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ గుప్త డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని సౌత్ క్యాంపస్ లో కాంట్రాక్టు ప్రొఫెసర్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత దశాబ్ద కాలం నుండి విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నామని, చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న సమస్యలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు ప్రొఫెసర్లు నరసయ్య, శ్రీకాంత్, దిలీప్, నిరంజన్, రమాదేవి, సునీత, వైశాలి తదితరులు పాల్గొన్నారు.

Spread the love