– తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ చైర్మెన్ డాక్టర్ శ్రీధర్‌కుమార్ లోధ్
– ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి పాదయాత్ర ,అరెస్టు
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల ందర్నీ రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ చైర్మెన్ డాక్టర్ శ్రీధర్‌కుమార్ లోధ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఉస్మానియా యూని వర్సిటీ ఆర్ట్స్ కళాశాల నుంచి తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ ఆధ్వర్యంలో సిద్దిపేట వరకు పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 80 రోజుల నుంచి విశ్వవిద్యాలయాల్లో ధర్నాలు, పోరాటాలు, సదస్సులు నిర్వహి స్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. అందువల్ల పాదయాత్ర చేపట్టాల్సి వచ్చిందని చెప్పారు. ఈ పాదయాత్ర సిద్దిపేట జిల్లా కోయినపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు కొనసాగుతుందని తెలిపారు. ఇదిలా ఉండగా, పాద యాత్రకు బయలుదేరిన అధ్యాపకులను పోలీసులు అరెస్టు చేసి ఓయూ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ వర్కింగ్ చైర్మెన్ డాక్టర్ ఎం.రామేశ్వరరావు, చైర్‌పర్సన్ పల్లా రేష్మారెడ్డి, కో చైర్మెన్ జరుపుల చందులాల్, ఆర్‌డీ ప్రసాద్, డాక్టర్ విజరు కుమార్, కె.హరీష్, డాక్టర్ అశోక్ డాక్టర్ కృష్ణమూర్తి, డాక్టర్, కిరణ్ ప్రేమ్, సుజాత, వాణి, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.