నవతెలంగాణ-భిక్కనూర్
శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒకరు పోలీసులకు సహకరించాలని ఎస్సై సాయి కుమార్ తెలిపారు. శనివారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఎస్సై సాయి కుమార్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సాయి రెడ్డి, పెద్ద మల్లారెడ్డి సొసైటీ చైర్మెన్ రాజా గౌడ్, నాయకులు ఉన్నారు.