ప్రపంచవ్యాప్తంగా హిందువులందరి యొక్క శ్రద్ధ కేంద్రము, కోట్లాదిమంది భక్తుల యొక్క కొంగు బంగారం అయిన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు ప్రసాదం తయారీలో పశువుల కొవ్వు, కల్తీ నూనెల వినియోగం జరిగినట్టుగా రిపోర్టులు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై దేశంలోనే అత్యున్నతమైన విచారణ జరిపి దోషులను వెంటనే గుర్తించి బహిరంగంగా ఉరితీయాలని హిందూ దేవాలయ పరిరక్షణ సమితి బుధవారం డిమాండ్ చేశారు. తిరుమలలో లడ్డు ప్రసాదం యొక్క కల్తీ కి నిరసనగా దేవాలయ పరిరక్షణ సమితి ఇందూరు శాఖ ఆధ్వర్యంలో ఇందూరులోని ధర్నా చౌక్ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించి కల్తీ కి కారణమైన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి హిందూ దేవాలయాలను, హిందూ దేవాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా కుట్రలు పన్నాడు. దేవాలయాలను ధ్వంసం చేయడం, దేవుడి రథాలను దహనం చేయడం, దేవాలయాల స్థలాలను చర్చిలకు రాసి ఇవ్వడం వంటి ఎన్నో దుర్మార్గాలకు పాల్పడటమే కాకుండా.. దేవీ దేవతల పట్ల ఎన్నో అనుచితమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఒక్కొక్కటిగా అతని పాపాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇంతటి అరాచకానికి పాల్పడ్డ వ్యక్తి భూమి మీద బతకడానికి వీలు లేదు. అందుకే అతన్ని అతను చేసిన దుర్మార్గపు పనులన్నింటినీ సాక్షాలతో సహా నిరూపించి బహిరంగ ఉరితీయాలని దేవాలయ పరిరక్షణ సమితి తరపున డిమాండ్ చేస్తున్నాము. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా దేవాలయ పరిరక్షణ సమితి పక్షాన లేఖలు రాయనున్నాము. జగన్మోహన్ రెడ్డి నుంచి మొదలుపెట్టి ఈ కుట్రలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని గుర్తించి వారు ఎంతటి వారైనా సరే ఉరి తీయాల్సిందేనని మరొక్కసారి దేవాలయ పరిరక్షణ సమితి పక్షాన హెచ్చరిస్తున్నాము. ఈ నిరసన కార్యక్రమంలో దేవాలయ పరిరక్షణ సమితి ప్రతినిధులు కిషన్, మురారి, బంటు ప్రవీణ్ ,చైతన్య కులకర్ణి, స్వామి, నాని, బంటురామరాజు, సాయి ప్రసాద్, అజయ్, చోటు, బంటి భాయ్, హిందూ సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.