రోడ్డు విస్తరణ పనులకు సహకరించండి : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

నవతెలంగాణ- చండూర్  
చండూరు మున్సిపల్  లో అసంపూర్తిగా నిలిచిపోయిన అభివృద్ధి పనులకు మున్సిపల్ ప్రజలు సహకరించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన రోడ్డు విస్తరణ, డ్రైనేజీ పనులను ఆయన  సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి, అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డు విస్తరణ పనుల్లో ఎవరైనా నష్టం కలిపితే  వారికి తన వంతుగా  నష్టపరిహారం అందిస్తారని హామీ ఇచ్చారు. ఎవరు కూడా అభివృద్ధి పనులకు అడ్డు రావద్దు అని అన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరగాలని, వేగవంతంగా పనులు చేపట్టాలని  అధికారులకు ఆదేశించారు.ఎక్కడ కూడా రోడ్ల పైన నీళ్లు నిల్వకుండా చూడలని  కమిషనర్ మణికరణ్ కు  ఆదేశించారు. విద్యుత్ సమస్యలపై  ఏఈతో కలిసి మాట్లాడారు. కమిషనర్ పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఇష్టం లేకపోతే సెలవుపై వేళ్ళు  అని మండిపడ్డారు. తన విధులు బాధ్యతారహితంగా  వ్యవహరించాలన్నారు. త్వరలో మున్సిపల్ రోడ్డు విస్తరణ పనులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దోటి వెంకటేష్ యాదవ్,  ఎంపిటిసి పల్లె వెంకన్న, పట్టణ అధ్యక్షులు అనంత చంద్రశేఖర్ గౌడ్, డాక్టర్ కోడి శ్రీనివాసులు, ఎండి సుజావుద్దీన్, సాపిడి రాములు, కోడి గిరిబాబు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love