‘ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని మిల్లర్లు సహకరించండి’

నవతెలంగాణ-కొడంగల్‌
రైస్‌ మిల్లర్లు పౌరసరఫరాల శాఖలో భాగ్యస్వాము లని, రైతాం గాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సామాజిక బాధ్యతగా ప్రభుత్వానికి స హకరించాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రైస్‌ మిల్లర్లను కోరారు. కొడంగల్‌లోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో మిల్లర్లతో ఎమ్మెల్యే ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పెరు గుతున్న ధాన్యం దిగుబడులకు అనుగుణంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ధాన్యం కొనుగోలు చేయా లని మిల్లర్లను కోరారు. అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని వరి ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ఇబ్బం ది లేకుండా చూడాలన్నారు. గత సీజన్‌లో కొనుగోలు చేసిన వరి ధాన్యం మిల్లులోనే నిల్వ ఉందని ఈ నెల చివరి వరకూ గడువు ప్రభుత్వం విధించిందని మిల్లర్లు సూచించడంతో ఒక నెల రోజులపాటు గడువు పొడిగిస్తామని డీలర్లకు సూచిం చారు. జిల్లాలో 3 మిల్లులు మాత్రమే ప్రస్తుతం కొనుగోలు చేస్తుండడంతో వరి రైతులు ఇబ్బందులు పడుతు న్నారని స్థానికంగా ఉన్న ఒక్కొక్క మిల్లు యజమాని 25 వేల క్వింటల ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. రైతులకు దగ్గరలో ఉన్న మిల్లులోనే వరి ధాన్యం అమ్ముకోవాలని రైతులకు సూచించారు. అకాల వర్షాలు కురవడంతో రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది స్థానిక మిల్లర్లు వరి ధాన్యం కొనుగోలు చేసుకుని సహకరించాలని కోరారు. పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి విమల, డిప్యూటీ తహసీల్దార్‌ సురేష్‌, బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు దామోదర్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ మాజీ మండల అధ్యక్షులు గోడల రామ్‌రెడ్డి, కౌన్సిలర్‌ మధుసూదన్‌ యాదవ్‌, పిఎస్‌సిఎస్‌ చైర్మన్‌ కటకం శివకు మార్‌, మాజీ వైస్‌ ఎంపీపీ నా రాయణ రెడ్డి, బోంరాస్‌పేట్‌ పిఎస్‌ సిఎస్‌ చైర్మన్‌ విష్ణు వర్ధన్‌ రెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ బీములు, బీఆర్‌ఎస్‌ నాయకులు టిటిరాములు నాయక్‌, సర్పంచ్‌లు సయ్యద్‌ అంజాద్‌, వెంకట్‌రెడ్డి, మిల్లర్లు, రైతులు పాల్గొన్నారు.

Spread the love