14 మందితో ‘ఇండియా’ కూటమి సమన్వయ కమిటీ

coordination-committee

నవతెలంగాణ ముంబాయి: ముంబయిలో 28 పార్టీలకు చెందిన అగ్రనేతల కీలక భేటీలో వచ్చే ఎన్నికల నాటికి ఉమ్మడి పోరుకు చేయాల్సిన సన్నద్ధతపై సమాలోచనలు జరుపుతున్నారు. వచ్చే లోక్‌సభ ఇందులో భాగంగా 14 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. కూటమికి సంబంధించి అత్యున్నత నిర్ణయాలు తీసుకొనే కమిటీగా ఇది వ్యవహరించనుంది. ‘ఇండియా’ కూటమి సమన్వయ కమిటీలో కాంగ్రెస్‌ నుంచి కేసీ వేణుగోపాల్‌, ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌, ఆర్జేడీ నుంచి తేజస్వీ యాదవ్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి అభిషేక్‌ బెనర్జీ, శివసేన నుంచి సంజయ్‌ రౌత్‌, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌, ఆప్‌ నేత రాఘవ్‌ చద్దా, సమాజ్‌ వాదీ పార్టీ నుంచి జావేద్‌ అలీ ఖాన్‌, జేడీయూ నుంచి లలన్‌ సింగ్‌, సీపీఐ నేత డి.రాజా, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నుంచి ఒమర్‌అబ్దుల్లా, పీడీపీ నుంచి మెహబూబా ముఫ్తీ, సీపీఐ(ఎం) నుంచి  కూడా ఒకరు ఉండనున్నారు. అది ఎవరు అనేది తరువాత తెలియజేయనున్నట్టు సమాచారం. ఈ అత్యున్నత నిర్ణాయక కమిటీ తక్షణమే సీట్ల పంపకాలపై కసరత్తు ప్రారంభించనుంది.

Spread the love