అంతర్రాష్ట్ర ఎక్సైజ్ అధికారుల సమన్వయ సమావేశం 

నవతెలంగాణ- కంటేశ్వర్:

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ లోని హోటల్ కృష్ణాలో మహారాష్ట్ర తెలంగాణ ఎక్సైజ్ అధికారుల సమన్వయ సమావేశం గురువారం నిర్వహించారు. నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి అదిలాబాద్ జిల్లా డిప్యూటీ కమిషనర్ నరసింహ రెడ్డి, నిజాంబాద్ అసిస్టెంట్ కమిషనర్ కిషన్, అదిలాబాద్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, నాందేడ్ ఎక్సైజ్ సూపర్డెంట్ అతుల్ కన్నాడే, నిజామాబాద్ ఎక్సైజ్ సూపర్డెంట్ మల్లారెడ్డి, కామారెడ్డి ఎక్సైజ్ సూపర్డెంట్ రవీందర్, అదిలాబాద్ ఎక్సైజ్ సూపర్డెంట్ హిమశ్రీ, మహారాష్ట్ర, నాందేడ్ జిల్లా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, నిజామాబాద్, అదిలాబాద్, జిల్లాల ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు ఆర్పిఎఫ్, జి ఆర్ పి ఎఫ్, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాలకు మహారాష్ట్ర సరిహద్దు ఉండడం వల్ల రానున్న ఎన్నికల్లో మహారాష్ట్ర నుండి తెలంగాణకు మద్యం గంజాయి దేశదారు సరఫరా అయ్యే అవకాశం ఉన్నందువలన ఎన్నో రాష్ట్రాల అధికారులు సమన్వయం చేసుకొని అక్రమ మద్యాన్ని ఉక్కుపాదంతో అరికట్టి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించుటకు కృషి చేయాలని సమన్వయంగా చర్చించారు.
Spread the love