దేశంలో భారీగా త‌గ్గి‌న‌ కరోనా కేసులు

lనవతెలంగాణ – ఢీల్లి: దేశంలో కరోనా వైరస్‌ కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 600 కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ  వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు 1,16,603 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 656 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,49,82,131కి చేరింది. ప్రస్తుతం దేశంలో 13,037 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కొవిడ్‌ నుంచి ఇప్పటి వరకు 4,44,37,304 మంది కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,31,790కి చేరింది.

Spread the love