మళ్లీ కలవరపెడుతున్న కరోనా..!

నవతెలంగాణ హైదరాబాద్: కరోనా వైరస్ మరోసారి కలవర పెడుతోంది. సింగపూర్‌లో కొవిడ్‌ కేసులు 56వేల మార్క్‌ను దాటాయి. వారంలోనే కేసులు 75శాతం పెరిగాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డిసెంబర్‌ 19 నుంచి రోజువారీ కొవిడ్‌ అప్‌డేట్స్‌ను విడుదల చేయాలని సింగపూర్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించాలని సింగపూర్ ప్రభుత్వం ప్రజలకు సూచించింది. సాధారణ ప్రజలు సైతం మాస్క్‌లు ధరించాలని కోరింది. వృద్ధులున్న ఇండ్లలోనూ మాస్క్‌లు ధరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
సింగపూర్‌లో కరోనా ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజుకు సగటున 225-350 వరకు ఉంటుంది. ఇన్ఫెక్షన్ కారణంగా ఐసీయూలో చేరిన రోగుల రోజువారీ సగటు 4-9గా ఉన్నది. అయితే, వైరస్‌ చాలా మందిలో కరోనా జేఎన్‌.1 బారినపడ్డట్టు తెలుస్తున్నది. ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాల్లో ఈ వేరియంట్‌ ఎక్కువగా వేగంగా వ్యాపించదని తేలింది.
మరోవైపు భాతర్‌లోనూ కరోనా కేసులు పెరిగాయి. ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన పని లేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. శుక్రవారం దేశంలో 312 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో కేరళలోనే 280 కేసులు రికార్డయ్యాయి. వ్యాధి సోకిన రోగుల్లో లక్షణాలు తీవ్రంగా లేవని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Spread the love