లక్ష్మి ఎంక్లేవ్ కాలనీ అభివృద్ధి కి కృషిచేస్తా : కార్పొరేటర్ బానోత్ సుజాతా నాయక్

నవతెలంగాణ – హస్తినాపురం
హస్తినాపురం డివిజన్ పరిధిలో లోని లక్ష్మి ఎంక్లేవ్ కాలనీ లో నెలకొన్న మౌలిక సమస్యలతో పాటు కమ్యూనిటీ హాల్ మరియు పార్క్ అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభం అయ్యే విధంగా కృషి చేస్తామని కాలనీ వాసులకు స్థానిక కార్పొరేటర్ బానోత్ సుజాతా నాయక్ హామీ ఇచ్చారు.ఆదివారం నాడు లక్ష్మి ఎంక్లేవ్ కాలనీ కార్యవర్గ ఆహ్వానం మేరకు సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కాలనీ కార్యవర్గం కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు.సమస్యల పట్ల స్పందించిన కార్పొరేటర్ కాలనీ సమస్యలతో పాటు కమ్యూనిటీ హాల్,పార్క్ ల అభివృద్ధి కి అతి త్వరలో ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి సహకారం తో నిధులు మంజూరి చేసి నిర్మాణాలు చేపట్టే విధంగా కార్యాచరణ రూపొందిస్తమని సుజాతా నాయక్ తెలిపారు.ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గోవర్ధన్,మాజీ కార్పొరేటర్ సామ రమణారెడ్డి, మహబూబ్ అలీ మాజీ బి.అర్.ఎస్ నాయకులు రామచంద్రనాయక్,గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి,ధర్వేశ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love