ఓల్డ్ బోయిన్పల్లి 119 డివిజన్ లో హరితహారంలో పాల్గొన్న కార్పొరేటర్ నరసింహ యాదవ్

నవ తెలంగాణ – బాలానగర్
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ పరిధిలోని సోమవారం నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాల మేరకు మేరకు ఓల్డ్ బోయిన్ పల్లి హ్యాట్రిక్ కార్పోరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని సీనియర్ సిటిజన్ అసోసియేషన్ పార్క్ లో, రోడ్ నెంబర్ 3 మల్లికార్జున్ నగర్ కాలనీలో చెట్లు నాటారు.ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ యుబిడి సిబ్బంది మరియు శానిటేషన్ సిబ్బంది, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్రె జంగయ్య, మన్నె ఉదయ్ యాదవ్, మల్లేష్ యాదవ్, చందు యాదవ్, డివిజన్ జనరల్ సెక్రెటరీ హరినాథ్, మహిళా ప్రెసిడెంట్ లలిత, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ బుర్రి యాదగిరి, బీసీ సెల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, మైనార్టీ ప్రెసిడెంట్ జాహంగీర్, సలీం, పిట్ల రాజు, పోచయ్య, దుర్గ, సంతోషి, శశికళ, రోజా, కవిత, ఉమా, కళాజ్యోతి దేవి ,అఫీజా, కమల, పద్మ వాణి, ఉదయ్ రాణి, కార్టూన్ సుప్రియ, సురేఖ, శ్రీలత, తేజు, సౌజన్య, శాంతి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Spread the love