– కర్నాటక ఎన్నికలతో సుస్పష్టం
– పలు రాష్ట్రాల్లోనూ పార్టీపై మరకలే
– రాజకీయనాయకులు, విశ్లేషకులు, నిపుణుల అభిప్రాయం
న్యూఢిల్లీ : బీజేపీ ఇప్పటి వరకు చెప్పుకుంటూ వస్తున్న అవినీతి వ్యతిరేక ట్యాగ్ ఉట్టిమాటలేనని తేలింది. కర్నాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర ఓటమే దీనికి నిదర్శనమని విశ్లేషకులు, నిపుణులు తెలిపారు. 40 శాతం కమీషన్ సర్కారుగా అపఖ్యాతిని మూటగట్టుకొని అక్కడి ప్రజల ఆగ్రహా నికి గురైన బీజేపీ.. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవా ల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. అయితే, బీజేపీ అవినీతి ఒక్క కర్నాటకకు మాత్రమే పరిమితం కాలేదనీ, ఆ పార్టీ అవినీతి లీలలు అనేక రాష్ట్రాల్లో ఉన్నాయని అన్నారు. బీజేపీ పార్టీ అవినీతిపై పలు రాజకీయ పార్టీల అధినేతలు, నాయకులు సైతం పలు సందర్భాల్లో వెల్లడించారు.
ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్‌కు సంబం ధించిన రెండు ఫైళ్లను క్లియర్ చేసేందుకు తనకు రూ.300 కోట్ల లంచం ఆఫర్ చేశారని జమ్మూ కాశ్మీర్ సహా నాలుగు రాష్ట్రాల మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇటీవల చేసిన ఆరోపణలతో స్టాలిన్ బీజేపీపై అవినీతి ఆరోపణలు చేశారు. అంతకు ముందు, ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీ వాల్ ప్రధాని మోడీ, బీజేపీని ”భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాలలో అత్యంత అవినీతిపరులు” అని అభివర్ణించారు.
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు మనోజ్ ఝా కూడా బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిపై పోరాడు తున్న పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీ వాదనను కర్నాటక ఫలితాలు తప్పని రుజువు చేశాయని తెలిపారు. ప్రభుత్వ పథకాల్లో 40 శాతం కమీషన్‌ను దోచుకుంటున్న అత్యంత అవినీతిపరుల నేతలకు కర్నాటక ప్రజలు తమ ఓటు హక్కుతో రుజువు చేశారని తెలిపారు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువ డిన వెంటనే, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పాట్నా, అరా, ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌ల లోని తొమ్మిది ఆర్జేడీ నాయకుల ఇండ్లు, కార్యాలయా లపై దాడులు, సోదాలు నిర్వహించడం ప్రారంభిం చింది. రాజ్యసభలోని పార్టీ పార్లమెంటు సభ్యుడు ప్రేమ్ గుప్తా, శాసన సభ సభ్యులు సందేశ్, కిరణ్ దేవి తదితరుల ఆస్తులపై దర్యాప్తు సంస్థ దాడులు చేసింది. అదే సమయంలో సత్యపాల్ మాలిక్ మాజీ మీడియా సలహాదారు సౌనక్ బాలి ఆస్థులతో సహా జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ మరియు రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు చేసింది. ఢిల్లీ, రాజస్థాన్‌లో ఉన్న ఓ చార్టెడ్ అకౌంటెంట్(సీఏ) ప్రయి వేటు వ్యక్తుల వద్ద కూడా సోదాలు జరగటం గమ నార్హం. ఫైళ్లను క్లియర్ చేసేందుకు లంచం ఇచ్చారని మాలిక్ చేసిన ఆరోపణలపై సీబీఐ గత నెలలో ఆయనకు సమన్లు జారీ చేసింది.