పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలి

నవతెలంగాణ-హత్నూర
పత్తి రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా రామదూత జిన్నింగ్‌ మిల్‌ యాజమాన్యం మోసం చేస్తోందని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి యాదవరెడ్డి అన్నారు. హత్నూర మండలం బోర్పట్ల-చందాపూర్‌ గ్రామ శివారులో గల రామదూత జిన్నింగ్‌ మిల్‌ను తెలంగాణ రైతు సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ బందం బుధవారం సందర్శించారు. పత్తి రైతుల నుండి కొనుగోలు చేస్తున్న విధానంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి యాదవరెడ్డి మాట్లాడుతూ ఆరుగాలం కష్టించి పండించిన తెల్ల బంగారమైన పత్తిని మద్దతు ధర లభిస్తుందని రామదూత జిన్నింగ్‌ మిల్లుకు తీసుకొస్తే సీసీఐ ద్వారా కాకుండా ప్రవేటుగా కొనుగోలు చేసి రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు. మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7020 ఇవ్వాల్సి ఉండగా అనేక సాకులు చెప్పుతూ రూ.6400 నుంచి రూ.6500 వరకు కొనుగోలు చేస్తున్నారని అన్నారు. ప్రైవేటుగా 700 కింటాళ్లు, సీసీఐ ద్వారా మూడు క్వింటాళ్లు కొనుగోలు చేయడంపై ప్రశ్నించగా రైతులు ఆన్లైన్లో పత్తి వేసుకున్నట్టు చూపడం లేదని, ప్రైవేటుగా కొనుగోలు చేస్తున్నామని సాకులు చెప్పుకొస్తున్నారని తెలిపారు. పత్తి రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా మోసం చేస్తున్నారని తెలిపారు. సంబంధిత అధికారుల దష్టికి తీసుకువెళ్తామని, రామదూత బిన్నింగ్‌ మిల్‌ యాజమాన్యాలపై చట్టరీత్యా చర్యలు తీసుకొని పత్తి రైతులకు మద్దతు ధర కల్పించి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు రామాంజనేయులు నరసింహారెడ్డి నరేందర్‌ మైసయ్య కష్ణ ఈశ్వర్‌ నర్సింలుపాల్గొన్నారు.

Spread the love