ప్రశాంతంగా ముగిసిన కౌంటింగ్‌

నవతెలంగాణ -వనపర్తి రూరల్‌
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయని జిల్లా ఎస్పీ రక్షితకే మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన విజేతలను నిర్ణయించే కీలక ఘట్టం ఎన్నికల కౌంటింగ్‌ జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చిట్యాల దగ్గర గల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ గోదాం నందు జరిగాయని, దాదాపు 137 మంది కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టడం జరిగింది తెలిపారు. ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియకు ఎలాంటి అంతరాయం కలగకుండా నియోజకవర్గాల వారీగా వేరువేరుగా కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రత్యేక భారీ కేట్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అల్లర్లకు గొడవలకు తావు లేకుండా ఓట్ల లెక్కింపు ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగిందని ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో కీలకంగా వ్యవహరించిన అధికారులను సిబ్బందిని ఆమె అభినందించారు అందుకు సహకరించిన జిల్లా ప్రజలకు ప్రజాప్రతినిధులకు ఆమె కతజ్ఞతలు తెలియజేశారు.

Spread the love