రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

నవతెలంగాణ వినుకొండ: గుంటూరు జిల్లా వినుకొండ మండలంలో కొత్తపాలెం గ్రామం కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు. వినుకొండ నుండి కర్నూలు వైపు వెళ్తున్న కారు డివైడర్ ని ఢీ కొట్టి పక్కనే ఉన్న చింత చెట్టుని ఢీకొట్టుకుని భార్యాభర్తలు మృతి చెందగా కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న వినకొండ ఎస్ హెచ్ ఓ సాంబశివరావు సంఘటన ప్రాంతానికి చేరుకొని చేరుకొని క్షతగాత్రున్ని 108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సిఐ తెలిపారు.

Spread the love