ఏపీలో దారుణం..దంపతులను నరికి చంపారు

నవతెలంగాణ-హైదరాబాద్ :  కృష్ణా జిల్లా మొవ్వ మండలం అయ్యంకిలో దారుణం చోటుచేసుకుంది. దంపతులను ప్రత్యర్థులు నరికి చంపారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. వీరంకి వరలక్ష్మి అనే మహిళను నడిరోడ్డుపై.. ఆమె భర్త వీరకృష్ణను పంచాయతీ కార్యాలయం వద్ద దుండగులు హతమార్చారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love