చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణను వాయిదా వేసిన కోర్టు

నవతెలంగాణ – అమరావతి: చంద్రబాబుకు సంబంధించిన పిటిషన్లపై విచారణను విజయవాడలోని ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్ లపై రేపు విచారిస్తామని తెలిపింది. కస్టడీ పిటిషన్ పై సీఐడీ మెమో దాఖలు చేసిన తర్వాత విచారణ జరుతామని చెప్పింది. రేపు కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్ పై వాదనలు విన్న తర్వాత.. రెండింటిపై ఒకే సారి ఆదేశాలను వెలువరిస్తామని తెలిపింది. ఈ రెండు పిటిషన్లపై దేన్ని ముందు విచారించాలో రేపు నిర్ణయిస్తామని వెల్లడించింది.

Spread the love