న్యాయం కోసం న్యాయస్థాన ఉద్యోగుల వేడుకోలు

Court employees' pleas for justice– ఓపీఎస్‌ నినాదాలతో దద్దరిల్లిన సిటీ సివిల్‌ కోర్టు
– 12న చలో హైదరాబాద్‌కు సంపూర్ణ మద్దతు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
న్యాయస్థానాల్లో పనిచేస్తున్న ఉద్యో గులే న్యాయం కోసం వేడుకునే పరిస్థితి వచ్చింది. పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌) కావాలంటూ సిటీ సివిల్‌ కోర్టులో ఉద్యో గులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌)ను రద్దు చేసి పాత పెన్షన్‌ స్కీం (ఓపీఎస్‌)ను అమలు చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయిస్‌ యూనియన్‌ (టీఎస్‌సీపీఎస్‌ఈయూ) ఆధ్వర్యంలో ఈనెల 12న తలపెట్టిన చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి వారు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈనెల 12న తలపెట్టిన చలో హైదరాబాద్‌ కార్యక్రమ సన్నాహక సమావేశాన్ని మంగ ళవారం హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్ట్‌ జ్యుడీషియల్‌ ఎంప్లాయిస్‌ అసో సియేషన్‌ హాల్‌లో నిర్వహిం చారు. ముఖ్యతిథులుగా టీఎస్‌సీపీఎస్‌ ఈయూ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ, ప్రధా న కార్యదర్శి కల్వల్‌ శ్రీకాంత్‌, జ్యుడీషియల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షులు లక్ష్మా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తప్పనిసరిగా సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని అన్నారు. స్థితప్రజ్ఞ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ తర్వాత బుక్కెడు బువ్వ, గుక్కె డు నీళ్లు కూడా ఇవ్వని సీపీఎస్‌ విధానం అన్యాయ మైనదని విమర్శిం చారు. ఆ విధానం వద్దనీ, కన్నతల్లిలాగా చూసుకునే పాత పెన్షన్‌ విధానమే ముద్ద ని చెప్పారు. రాష్ట్రంలో 1.72 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగ, ఉపాధ్యాయుల తోపాటు పాత పెన్షన్‌లో ఉన్న సమస్త ఉద్యోగులు 3.30 లక్షల మంది వారి గళాన్ని వినిపించ డానికి ఈనెల 12న హైదరాబాద్‌కు తరలిరావా లని పిలుపునిచ్చారు. సీపీఎస్‌ సమస్య ప్రభుత్వానికి తెలిసేలా ఐక్యత చాటలని కోరారు. 309 అధికరణం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగికి సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాని దేనని అన్నారు. ఇప్పటివరకు సీపీఎస్‌ ఉద్యోగులకు గ్రాట్యూటీ, ఫ్యామిలీ పెన్షన్‌ సాధించిన ఘనత తమ యూనియన్‌దే నని చెప్పారు. ఇక మిగిలిన సర్వీస్‌ పెన్షన్‌ను సాధించుకుని పాత పెన్షన్‌ను పునరుద్ధరింప చేసుకోవాలన్నారు. కార్య క్రమంలో జ్యుడీషియరీ ఎంప్లాయీస్‌ అసో సియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు సుబ్బయ్య, సీపీఎస్‌ యూని యన్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులు కోట కొండ పవన్‌, హైదరా బాద్‌ జిల్లా అధ్యక్షులు నరేందర్‌ రావు, నాయకులు శ్యామ్‌, ఆనంద్‌ పాల్గొన్నారు.

Spread the love