నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్, సుబ్రమణ్యస్వామిలకు కోర్టు కీలక ఆదేశాలు

నవతెలంగాణ – హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో నివేదించిన అంశాలపై లిఖితపూర్వక షార్ట్ నోట్ దాఖలు చేయాలని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామిని, కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. వాదనలపై నాలుగు వారాల్లో లిఖితపూర్వక నోట్ దాఖలు చేయాలని జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ వీరిని ఆదేశించారు. నేషనల్ హెరాల్డ్ కేసుపై ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. లిఖిత పూర్వక నోట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసి, తదుపరి విచారణను అక్టోబర్ 29కి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులను ప్రాసిక్యూట్ చేయడానికి తనను అనుమతించాలని సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రయల్ కోర్టు కొట్టివేసింది. దీంతో 2021 ఫిబ్రవరి 11న సుబ్రమణ్యస్వామి హైకోర్టును ఆశ్రయించారు.

Spread the love