జ్ఞానవాపీ సర్వేపై 21న కోర్టు తీర్పు

వారణాసి : కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఉన్న జ్ఞానవాపీ మసీదులో శాస్త్రీయ సర్వే నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటీషన్‌పై వారణాసిలోని కోర్టు విచారణను ముగించింది. తీర్పును ఈ నెల 21కి రిజర్వ్‌ చేసింది. మసీదు ప్రాంగణం మొత్తాన్ని సర్వే చేసేలా ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఎఎస్‌ఐ)కి ఆదేశాలు ఇవ్వాలని కొంత మంది హిందువులు ఈ పిటీషన్‌ దాఖలు చేశారు.

Spread the love