– పంద్రాగస్టు నుండి హెల్మెట్ తప్పనిసరి
– నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లాలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధారణ తప్పనిసరి అవుతుంది. వాహనదారులు హెల్మెట్ ఉపయోగించుకోకపోవడంతో ప్రమాదాల్లో మరణాలకు హెల్మెట్ లేకపోవడం కారణము అవుతుంది. అయితే ఈ నెల 15 ఆగస్టు నుండి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ తప్పనిసరి అవుతుంది. నిజామాబాద్ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ద్విచక్ర వాహనంపై వెళ్ళినప్పుడు తలపై హెల్మెట్ ఉన్న లేకున్నా పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు నా పరిస్థితులలో పోలీసులు పంద్రాగస్టు నుండి కఠినంగా వ్యవహరించనున్నారు. వాహనాల తనిఖీల సమయంలో హెల్మెట్ ధరించకుండా పట్టుబడితే ప్రతి వాహనదారుడు కి ట్రాఫిక్ పోలీసులతో పాటు సంబంధిత పోలీస్ స్టేషన్లో వారు జరిమానాలు విధించబోతున్నారు. జిల్లాలో ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాలు జారీ చేశారు. ఇది తూచా తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాలి. ముఖ్యంగా నిజామాబాద్ నగరం తో పాటు ఇతర ప్రాంతాలలో కూడా ట్రాఫిక్ ను ప్రమాదాలను అరికట్టేందుకు పోలీస్ చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించిన జరిమానా తో పాటు చట్టపరంగా చర్యలు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. కొంతమంది నిజామాబాద్ పట్టణ వాసులతో పాటు ఇతర ప్రాంతాలనుండి పట్టణానికి వచ్చేవారు నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడంతో కొన్నిసార్లు ప్రమాదాలు జరిగి తీవ్రంగా గాయపడటం కూడా జరుగుతుంది. అలాగే మరణించిన సంఘటనలు కూడా గతంలో ఎక్కువగానే సంభవించాయి. ఈనెల 15 నుండి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పరమేశ్వర్ ఆదేశాలతో ట్రాఫిక్ పోలీసులతో పాటు పోలీస్ స్టేషన్లో వారిగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ లను నిర్వహిస్తారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకొని జరిమానాలు విధిస్తూ అవసరమైతే కేసులను కూడా నమోదు చేస్తామని ప్రజలను హెచ్చరించారు. ఏదేమైనాప్పటికీ ఈ నిబంధనలు గతంలో అమలు చేశారు కానీ మూడ్నాల్ల ముచ్చటగా ముగిసింది. ఈసారి అమలు జరిగే నిబంధనలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సి ఉంటుంది.