సీపీ సందీప్ శాండిల్యకు అస్వస్థత..

నవతెలంగాణ – హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ (సీపీ) సందీప్ శాండిల్య అస్వస్థతకు గురయ్యారు. బషీర్‌బాగ్‌ పాత సీపీ కార్యాలయంలో ఉండగా సందీప్‌ శాండిల్య ఛాతీనొప్పితో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో అపోలో ఆస్పత్రిలో ఆయన చేరారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love