శ్రీరామనవమి శోభాయాత్ర ఏర్పాట్లపై సీపీ శ్రీనివాస్‌రెడ్డి సమీక్ష

నవతెలంగాణ – హైదరాబాద్‌: అందరూ కలిసి పనిచేస్తే ఈ నెల 17వ తేదీన శ్రీరామనవమి శోభాయాత్ర విజయవంతం అవుతుందని హైదరాబాద్‌ నగర సీపీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. యాత్ర నిర్వహణపై పోలీసులు, వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గత ఏడాది జరిగిన పొరపాట్లను ఈసారి పునరావృతం కానివ్వొద్దని సూచించారు. వేడుకల సమయంలో నగరంలో మత సామరస్యం వెల్లివిరిస్తుందని చెప్పారు. సమయం తక్కువగా ఉందని.. అధికారులు సెలవు రోజుల్లో కూడా పని చేయాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

Spread the love