సీపీఐ, కాంగ్రెస్ గెలుపుపై  సీపీఐ నాయకుల సంబరాలు 

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కొత్తగూడెం నియోజకవర్గం అభ్యర్థి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ గెలుపొందడం సోమవారం సిపిఐ నాయకులు పార్టీ కార్యాలయంలో కెక్ కట్ చేసి సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్  మాట్లాడుతూ సిపిఐ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులను గెలిచేందుకు నిర్విరామంగా కృషి చేసిన ప్రతి నాయకునికి, సిపిఐ, కాంగ్రెస్ అభ్యర్థులను అత్యదిక మెజారిటీతో గెలిపించిన కొత్తగూడెం, హుస్నాబాద్ నియోజకవర్గం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  కొయడ కొమురయ్య, అయిలేని సంజివరెడ్డి, గూడ పద్మ, జనగాం రాజు కుమార్, అయిలేని మల్లారెడ్డి ,పోదిల కుమారస్వామి, ఎండి అక్బర్, పుదరి రఘుపతి, పోదిల కనకస్వామి, ఇజ్జగిరి కిష్టయ్య, గుగ్గిల్ల మల్లేశం, పిట్టల ప్రసాద్, కాల్వల ఎల్లయ్య, ఇంద్రాల మల్లయ్య,దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నాయకురాల్లు నేలవేణి స్వప్న, పొన్నాల స్వప్న తదితరులు పాల్గొన్నారు.
Spread the love