– అక్రమార్కులపై తహసిల్దార్ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి
నవతెలంగాణ – బెజ్జంకి
తహసీల్ పక్కన అక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని అధికారులు కాపాడాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.శనివారం మండల కేంద్రంలోని తహసీల్ పక్కన ప్రభుత్వ భూమిని అక్రమించి ఏర్పాటుచేసిన వెంచర్ ను సీపీఐ నాయకులు సందర్శించి పరిశీలించారు.సర్వే నెంబర్ 643 యందు అక్రమణకు గురైన ప్రభుత్వ భూమిలో లే అవుట్ నిర్మాణానికి ఎంపీడీఓ అనుమతులు జారీ చేయడంలో అంతర్యమేమిటో బహిర్గతం చేయాలని సీపీఐ నాయకుడు సంగెం మధు అగ్రహం వ్యక్తం చేశారు.తహసిల్దార్ ప్రత్యేక శ్రద్ధ వహించి సర్వేయర్ తో తక్షణమే కొలతలు నిర్వహించి వెంచర్ ఏర్పాటుచేసిన అక్రమార్కులపై చర్యలు తీసుకుని అక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.