నవతెలంగాణ – అశ్వారావుపేట
ఏజన్సీ ప్రాంతంలో తుని కాకు సేకరణ చేపట్టి ఆదివాసీలకు వేసవి కాల ఉపాధి కల్పించాలని, నియోజక వర్గం కేంద్రంలో బీడీ పరిశ్రమను నెలకొల్పాలని సీపీఐ ఎమ్.ఎల్ – మాస్ లైన్ (ప్రజాపంధ) పాల్వంచ డివిజన్ కార్యదర్శి గోకినపల్లి ప్రభాకర్,జిల్లా నాయకు కలయ్యలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివాసీలకు తునికాకు సేకరణలో కనీస సౌకర్యాలు కల్పించాలని సూచించారు. వేలం నిర్వహించని యూనిట్లను ప్రభుత్వం చేపట్టి తుని కాకు సేకరణ చర్యలు తీసుకోవాలని కోరారు.స్థానిక రెవెన్యూ కార్యాలయంలో శనివారం తుని కాకు సేకరణ సమస్యలపై తహశీల్దార్ కృష్ణ ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 50 ఆకుల కట్టకు రూ.5 లు చెల్లించాలని కోరారు. అదేవిధంగా బీడీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని సూచించారు.కార్యక్రమంలో పార్టీ నాయకులు వాసం బుచ్చి రాజు,మాజీ సర్పంచ్ లు కంగాల భూ లక్ష్మీ,గొంది లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.