‘సీపీఐ ప్రజా గర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలి’

నవతెలంగాణ-షాబాద్‌
4న కొత్తగూడెంలో నిర్వహించే సీపీఐ ప్రజా గర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నియోజకవర్గ కన్వీనర్‌ రామస్వామి పిలుపునిచ్చారు. సోమవారం షాబాద్‌ మండల కేంద్రంలో సీపీఐ పజా గర్జన బహిరంగ సభ వాల్‌పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల కొత్తగూడెంలో జరిగే సీపీఐ ప్రజా గర్జన బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ,పార్టీ షాబాద్‌ మండల కార్యదర్శి నక్క జంగయ్య, సహాయ కార్యదర్శి రుక్కయ్య, బీకెఎంయూ చేవెళ్ల మండల ప్రధాన కార్యదర్శి మల్లేష్‌, శ్రీను, కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.

Spread the love