– సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి
నవతెలంగాణ – నూతనకల్
ప్రశ్నించే గొంతుక ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్ ను భువనగిరి పార్లమెంట్ ఒక వర్గ సభ్యుడిగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి కోరారు. గురువారం మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో మాట్లాడుతూ.. జహంగీర్ గత 30 సంవత్సరాలుగా విద్యార్థి, యువజన సంఘాలలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేశారని రైతంగ సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) చేస్తున్న పోరాటాలలో పాల్గొన్నారని అన్నారు. విద్యార్థి ,మేధావులు, చైతన్యం గల తుంగతుర్తి నియోజకవర్గం గత పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని యువత సీపీఐ(ఎం)కు ఓటేసి గెలిపించాలని కోరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గత పది సంవత్సరాలుగా పాలన లో నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటాయని అన్నారు. మోడీ అధికారంలోకి రాకముందుకు అనేక వాగ్దానాలు చేశారని ఇండ్లు లేని వారి కోసం ఇండ్ల నిర్మాణం చేపడతామని బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని ప్రజల ఖాతాలో వేస్తామని ఉద్యోగాలు ఇస్తామని అనేక హామీలు ఇచ్చి గెలుపొంది, 10 సంవత్సరాలు అయినా హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు దేశంలో బీజేపీ కుల,మత లా మధ్య వినేదాలు సృష్టిస్తూ విభేదాలను సృష్టిస్తుందని అన్నారు. మరోసారి కేంద్రంలో ప్రధానిగా మోడీ వస్తే దేశం కాషాయ రంగులోకి మారుతుందని రాజ్యాంగాన్ని మార్చి ఉన్నత వర్గాలకే మేలు జరిగే విధంగా చేస్తారని విమర్శించారు. ఇప్పటికే మోడీ పాలనలో మహిళలకు, దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు బీజేపీ నీ వ్యతిరేకించే ఏ సంస్థనైనా ఈడీ, సీపీఐలతో దాడి చేయించి జైలు లో పేడుతున్నారని అన్నారు. సీపీఐ(ఎం) పార్టీ పోరాట పలితంగానే దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కొనసాగుతుందని గుర్తు చేశారు. నేడు భువనగిరిలో జరిగే నామినేషన్ కార్యక్రమానికి పోలిట్ బ్యూరో సభ్యులు బి వీ రాఘవులు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరై ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) అభిమానులు కార్యకర్తలు విద్యార్థులు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు జి నరసింహారావు, కొప్పుల రజిత, నూతనకల్ మండల కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి ,మద్దిరాల మండల కార్యదర్శి కల్లేపల్లి భాస్కర్, మండల నాయకులు గజ్జల్ల శ్రీనివాస్ రెడ్డి బాణాల విజయ్ బాలకృష్ణ తిరుమలేష్ మధు శంకర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.