ఒడిశా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సీపీఐ(ఎం)అభ్య‌ర్ధి ఘ‌న విజ‌యం

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఒడిశా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సీపీఐ(ఎం)అభ్య‌ర్ధి ఘ‌న విజ‌యం సాధించారు. కాగా ఒడిశా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఊహించ‌ని ఫ‌లితాలు వెలుబ‌డుతున్నాయి. ఇన్నాళ్లూ ఎదురులేకుండా సాగిన న‌వీన్ ప‌ట్నాక్ స‌ర్కారుకు ఇప్పుడు బీజేపీ జ‌ల‌క్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఆధిక్యంలో కొన‌సాగుతున్న‌ది. 147 స్థానాలు ఉన్న ఆ రాష్ట్రంలో.. ప్ర‌స్తుతం బీజేపీ 74 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్న‌ది. మ‌రో వైపు బీజేడీ 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న‌ది. కాంగ్రెస్ పార్టీ 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బోనై నియోజకవర్గంలో  సీపీఐ(ఎం)అభ్య‌ర్థి లక్ష్మణ్ ముండా ఘ‌న విజ‌యం సాధించారు.

Spread the love