– శాసనసభలో వామపక్షాలు లేకపోవడం ఆందోళనకరం
– ప్రజా పోరాట చరిత్రను తిరగరాద్దం
– సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
శాసనసభలో వామపక్షాలు లేకపోవడం ఆందోళనకరమని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సీపీఐ(ఎం) అభ్యర్థి యాదయ్యని గెలిపించాలని కోరుతూ చేపట్టిన ప్రచారం సందర్భంగా ఇబ్రహీంపట్నంలోని పాషా, నర హరి స్మారక కేంద్రంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్య దర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ, జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్‌తో కలిసి ఆయన మాట్లాడా రు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ తమ అభ్యర్థులను గెలిపించాలం టుందన్నారు. కానీ దేశంలో ఏ పార్టీకి మద్దతు ఇస్తుందో స్పష్టం చేయడం లేదన్నారు. కేసీఆర్ వ్యవహార శైలి చూస్తుంటే బీజేపీకి కూడా మద్దతు ఇస్తారని అనుకోవాలా? లేక ఇండియా కూటమికి మద్దతు ఇస్తారా అన్నది స్పష్టత లేదన్నారు. బీజేపీతో సర్దుబాటు చేసుకునే ముందుకు పోతున్నట్లు అర్థమవుతుందన్నారు. అవసరమైతే బీజేపీకి అవకాశం లేకపోతే కాంగ్రెస్ అన్నట్లుగా ఆ పార్టీ వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. లౌకిక, ప్రజాస్వామ్య విధా నాలను కాలరాస్తున్న మతోన్మాలను బీజేపీకి పట్ల తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ముందుకు సాగాలని కోరారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి ఒక్క ఓటు కూడా పడకుండా వామపక్షాలు కృషి చేస్తు న్నాయని చెప్పారు. ఆ పార్టీ గెలువని స్థానాల్లో సైతం ఒక్క ఓటు కూడా పడకుండా వామపక్షాలు పని చేస్తున్నాయన్నారు. మరోవైపు బీజేపీ పట్ల కాంగ్రెస్ కఠినమైన వైఖరిని తీసుకోవాలన్నారు. తెలంగాణ శాసనసభలో వామపక్షాలు లేకపోవడం ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యం కాదన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కాంగ్రెస్ గెలిచిన ప్రజలకు లాభం జరగదన్నారు. అధికారంలో ఉన్న సందర్భాల్లో ప్రజా ఉద్యమాలపై నిర్బంధాలు, అరెస్టులు, దాడులు కొనసాగాయని చెప్పారు. ఆ పార్టీలన్నీ అ న్యాయాలు, అక్రమాలకు పాల్పడినవేనని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా అదే పద్ధతిని కొనసాగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరు ణంలో వామపక్షాలు, అందులోనూ సీపీఐ(ఎం) ప్రాతినిధ్యం అవసరమ న్నారు. రాష్ట్రంలో 19 స్థానాల్లో సీపీఐ(ఎం), ఒక్క స్థానంలో సీపీఐ, మరికొన్ని స్థానాల్లో వామపక్ష శక్తులు పోటీ చేస్తున్నాయని ఆ పార్టీలకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రజా, భూ పోరాటాల చరిత్రను తిరగ రాద్దామని చెప్పారు. ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులకు ప్రజల్లో ఆదరణ మెం డుగా ఉందన్నారు. పగడాల యాదయ్యకు అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామెల్, జగదీష్ మండల కార్యదర్శి సిహెచ్ జంగయ్య, మున్సిపల్ కార్యదర్శి ఎల్లేష్, నాయకులు రామకష్ణారెడ్డి, ఆనంద్, పురుషోత్తం తదితరులు ఉన్నారు.