కేరళ వాయనాడు జిల్లా వరద బాధితుల సహాయ నిధి రూ.13,600 సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ విరాళాలు సేకరించి రాష్ట్ర సీపీఐ(ఎం) పార్టీ ద్వారా కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి పంపించారు. విరాళాల సేకరణలో పాల్గొన్నవారు సీపీఐ(ఎం) పార్టీ జిల్లా మాజీ కార్యదర్శి ప్రస్తుత కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, విగ్నేష్, నగర కమిటీ సభ్యులు నల్వాల నరసయ్య, కటారి రాములు పాల్గొన్నారు. సీపీఐ(ఎం) నిజామాబాద్ జిల్లా పార్టీ కార్య దర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ.. కలెక్టర్ కార్యాలయంలో చైర్ టు చైర్ విరాళాల సేకరణ చేయడం జరిగింది. అందరూ కూడా తరతమస్థాయిలో మానవతా దృక్పథంతో సహాయం అందించి ఏదైనా ప్రకృతి విలయానికి నష్టపోయిన వారికి చేయూతనివ్వడానికి మేమున్నామంటూ వారి సహాయ గుణాన్ని చాటుకున్నారని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం దాన్ని జాతీయ విపత్తుగా భావించి పూర్తిస్థాయిగా సహకరించాల్సిన బాధ్యతను విస్మరించి విలవిలలాడుతూ ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతున్న వారి కష్టాలను రాజకీయం చేస్తూ మాట్లాడుతున్నారు. మానవసేవే మాధవసేవ అనే భగవద్గీత మార్గదర్శకాలని పక్కనపెట్టి రాజకీయాలు చేయడం సిగ్గుచేటని పెద్ది వెంకట్రాములు అన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా బిజెపి నాయకులు వ్యంగ్యంగా మాట్లాడతా ఉంటే దేశం దేశ ప్రజల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని అన్నారు. అయినప్పటికీ మీకు అండగా మేమున్నం అంటూ దేశ ప్రజల్లో భాగమైన సినీ తారలు, కొంతమంది వ్యాపారవేత్తలు, కర్ణాటక, తమిళనాడు లాంటి ప్రభుత్వాలు ముందుకొచ్చి కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చి తమ దాత్రుత్వాన్ని చాటుకున్నారు. అందుకని సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కమిటీ విరాళాలు సేకరించింది. వాటిని రాష్ట్ర కమిటీ ద్వారా కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపనున్నట్లు తెలిపారు. అలాగే వామపక్ష ప్రజాసంఘాలు కూడా ముందుకొచ్చి విరాళాలు సేకరించి పంపాలని అందుకు జిల్లా ప్రజలందరూ తమ మానవత్వపు గొప్ప మనసుని చాటుకోవాలని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి వారికి సరిపడా జాతీయ విపత్తుల జాబితా పరిగణలోకి తీసుకొని అన్ని కోణాలలో సహాయ సహకారాలు అందించాలని సీపీఐ(ఎం) పార్టీ నిజాంబాద్ జిల్లా కమిటీ డిమాండ్ చేశారు .