సీపీఐ(ఎం) పార్టీ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం వేములవాడ పట్టణ కేంద్రంలో ప్రధాన వీధుల్లో స్థానిక ప్రజల , దుకాణ యజమానుల నుండి కేరళలో వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేరళలో తుఫాన్ వలన వాయనాడ్ లో కొండచరియలు విరిగిపడడంతో సుమారు 350 మంది మరణించడం, ఎంతో మందికి గాయాలు అయ్యాయి. తుఫాన్ వలన ఇండ్లకు ఇండ్లు కొట్టుకపోయి ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం విపరీతంగా జరగడం చాలా బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఆదుకునేందుకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం శయ శక్తుల కృషి చేస్తుంది. కేంద్రం ప్రభుత్వం కూడా వారిని అన్ని రకాల ఆదుకోవాలని కోరారు. వేములవాడ ప్రజల నుండి సేకరించిన విరాళాలను మొత్తం సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ కేరళ వరద బాధితులకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, ముక్తికంతా అశోక్, జవ్వాజి విమల, మల్లారపు ప్రశాంత్, గురిజాల శ్రీధర్, నాయకులు చిలుక బాబు, రామంచ అశోక్ తదితరులు పాల్గొన్నారు.