నవతెలంగాణ – అచ్చంపేట
అచ్చంపేట నియోజకవర్గంలోని ఇండ్ల స్థలాలు లేని పేదలకు ప్రభుత్వం వెంటనే ఇళ్లస్థలాలు పంపిణీ చేయాలని సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దేశాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ పేదలకు నివాసం ఉండడానికి గూడు కరువైతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ సీపీఐ(ఎం) పార్టీ రాజకీయ శిక్షణ తరగతులు బుధవారం ప్రారంభం అయ్యాయి. పట్టణంలో పేదల ఇళ్ల స్థలాల కోసం సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేశామని గుర్తు చేశారు. సీపీఐ(ఎం) పార్టీ పోరాటం ద్వారా వచ్చిన ఇళ్ల స్థలాలను బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దుచేసి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం చేసి కొందరికి మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. మిగతా భూమిని ప్లాట్లుగా చేసి ఇళ్ల స్థలం లేని నిరుపేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ఈ దేశంలో పార్లమెంటు ఎన్నికలు మొన్ననే జరిగాయని, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి తిరిగి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నదని వారు అన్నారు. చేసిన అభివృద్ధి పనిని చెప్పుకోలేక మత వైశాల్యాలను రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమే బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ దేశ సంపదను బడా పెట్టుబడిదారులకు దోచిపెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని మారుస్తామన్న బీజేపీకి ప్రజలు తగిన స్థాయిలో బుద్ధి చెప్పారని వారు అన్నారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలని లేనిచో రాబోయే కాలంలో ప్రజల పక్షాన రాష్ట్రంలో ఉద్యమం చేపడుతామని వారు అన్నారు.
కులం,మతం మతోన్మాదం క్లాసును క్లాస్ టీచర్ కె. వెంకటేశ్వర్ బోధించారు దేశంలో మతాల పేరుతో ఆధిపత్యం ధోని కొనసాగుతుందని అది దేశ ప్రజలకు ప్రమాదంగా మారుతుందని వాటిని ప్రజలు గమనించాలని వారు అన్నారు. ఈ దేశంలో దోపిడి చేసే వర్గం దోపిడీకి గురయ్యే వర్గం మధ్య జరుగుతున్న ప్రజా పోరులో దోపిడి గురయ్యే వర్గం రాజ్యాధికారం కోసం నూటికి ఎనభై శాతం ప్రజలు ఐక్యమత్యం అయినప్పుడే సాధ్యం అవుతుందని వాటికోసం ఎర్రజెండా కమ్యూనిస్టు పార్టీ నిరంతరం ప్రజా పోరాటాలు నిర్వహిస్తుందని వారు అన్నారు. ఈ దేశంలో అసమానతలు లేకుండా ఉండాలంటే కమ్యూనిస్టులు రాజ్యాధికారంలోకి వస్తే తప్ప మారదని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మల్లేష్ , నాగరాజు, వెంకటయ్య, చంద్రయ్య, మధు, బాలు, సైదమ్మ, రజిత, పార్వతి, వెంకటయ్య, కృష్ణ, శివకుమార్, స్వామి ,లక్ష్మయ్య, కృష్ణయ్య ,పార్టీ శాఖ కార్యదర్శులు పార్టీ సభ్యులు ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సీపీఐ(ఎం) పార్టీ రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభం చేస్తూ ముందుగా సీపీఐ(ఎం) పార్టీ జెండాను సీనియర్ కామ్రేడు చిన్న అంజనేయ ఎగరవేశారు. అనంతరం అమరవీరులకు నివాళి అర్పిస్తూ నినాదాలు చేశారు. శిక్షణ తరగతులకు అధ్యక్షతగా కామ్రేడ్ శంకర్ నాయక్ వ్యవహరించారు.