సీతారాం ఏచూరి  మరణం బాధాకరం: సీపీఐ(ఎం) 

నవతెలంగాణ –  చండూరు 
కమ్యూనిస్ట్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు, సీపీఐ(ఎం) జనరల్ సెక్రటరీ, పొలిటి బ్యూరో సభ్యుడు సీతారామ్ ఏచూరి మరణం బాధాకరం అని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మొగుదాలా వెంకటేశం గౌడ్, సహాయ  కార్యదర్శి  జరిపోతుల ధనంజయ గౌడ్ లు అన్నారు. గురువారం స్థానిక చౌరస్తాలో అనే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆయన మరణం సిపిఎం పార్టీకి తీరంలోటని వారు పేర్కొన్నారు. 1952లో మద్రాస్ లో జన్మించి ఢిల్లీ నేతగా ఎదిగారని, ఆయన పూర్తి పేరు ఏచూరి సీతారామారావు అని తెలిపారు. జేఎన్యు విద్యార్థి నాయకునిగా మూడుసార్లు ఎన్నికయ్యారని,1985 లో కమ్యూనిస్టు పార్టీ కింద కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారని, 1999లో పొలిటి బ్యూరో సభ్యునిగా చోటు దక్కించుకున్నారని అన్నారు. 2005 లో తొలిసారిగా బెంగాల్ నుంచి రాజ్యసభకు  ఎన్నికయ్యారని, 2015, 2018,,2022 లో మూడుసార్లు పార్టీ జాతీయ కార్యదర్శిగా పని చేశారని వారు పేర్కొన్నారు. తన జీవితాన్ని అంతా కమ్యూనిస్ట్ సిద్ధాంతాల కోసం దార పోసి, సమసమాజ నిర్మాణమే ధ్యేయంగా, ఆర్థిక అసమానతల పై పోరాడుతూ.. పేదల పక్షాన దేశస్థాయిలో  గళంవిప్పిన మహోన్నత వ్యక్తి ఏచూరి.. అని వారు కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో  సీనియర్ నాయకులు చిటిమల లింగయ్య, సాయం కృష్ణయ్య. బొమ్మరబోని అశోక్, సాయం నగేష్, పిట్టల వెంకన్న, బొమ్మర గోని సుమన్, సైదులు, వెంకన్న, సాయం భిక్షం, పిట్టల అంజి, తదితరులు పాల్గొన్నారు.
Spread the love