సీపీఐ(ఎం) నాయకులు మునియ్య మృతి..

– నివాళులు అర్పించిన పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
వినాయకపురం కు చెందిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు,మండల కమిటీ సభ్యులు దానపు మునియ్య(60) గత కొన్నాళ్ళుగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన స్వగృహంలో శనివారం తెల్లవారు జామున మృతి చెందారు. ఆదివారం సమాచారం తెలుసుకున్న జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లయ్య, మండల కార్యదర్శి చిరంజీవి లు వినాయకపురం చేరుకుని మునియ్య భౌతిక కాయం పై పార్టీ పతాకాన్ని కప్పి నివాళులు అర్పించారు.కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఈ కార్యక్రమంలో ముళ్ళగిరి గంగరాజు, జగన్నాధం, సత్యనారాయణ, భద్రం లు ఉన్నారు.

Spread the love