జనగామలో సీపీఐ(ఎం) మహార్యాలీ .. బహిరంగ సభ


నవతెలంగాణ జనగామ: ప్రజాసమస్యలపై పోరాటం చేస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే సీపీఐ(ఎం) అభ్యర్థి మోకు కనకారెడ్డిని గెలిపించాలని ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణి ఆలి ప్రజలను కోరారు.  జనగామ శాసనసభ నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి మోకు కనకారెడ్డిని విజయాన్ని కాంక్షిస్తూ జనగామలో సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. అంతకు ముందు జనగామ పట్టణంలో భారీ ర్యాలీ  నిర్వహించారు.

Spread the love