సీతారాం ఏచూరి కి సంతాపం ప్రకటించి నివాళులర్పించిన సీపీఐ(ఎం)పార్టీ 

నవతెలంగాణ – కంటేశ్వర్
సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి  సీతారాం ఏచూరి  అనారోగ్యంతో ఢిల్లీలోని ఏమ్స్ హాస్పటల్లో మరణించినందున ఆయన మరణానికి సంతాప సూచకంగా సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ జెండాను అవనతం చేసి  ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి సంతాపాన్ని ప్రకటించటం జరిగింది. అనంతరం జరిగిన సంతాప సభలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ.. భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో కమ్యూనిస్టుల ఐక్యత కొరకు అతి నిర్మాణంలో యువత భాగస్వామ్యం కోసం విశేష కృషి  చేశారని అనేక ప్రజా సమస్యల పరిష్కారంలో చట్టసభల్లో, ప్రజా ఉద్యమాల్లో, విశేష కృషి చేశారని విద్యార్థి సంఘ నాయకుడిగా తన ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించి పార్టీ అఖిలభారత కార్యదర్శిగా సేవలందించారని నిజామాబాద్ జిల్లాలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా జరిగిన బహిరంగ సభలో 2017లో బహిరంగ సభకు హాజరై ప్రజా పోరాటాల పైన తెలియజేస్తూ జిల్లాలో ఉన్న సమస్యలను కూడా ప్రస్తావించటం జరిగిందని ఆ రకంగా ఈ జిల్లాతో సీతారాం ఏచూరి చిరు  అనుబంధం ఉన్నదని తెలియజేశారు. ఈ సంతాప సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట రాములు, నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు రామ్మోహన్, విగ్నేష్, నాయకులు రాములు, నరసయ్య,  సిర్పలింగం, సతీష్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love