సీపీఐ(ఎం) సానుభూతిపరులు మామిళ్ళ రంగా మృతి 

– సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పోతినేని, నున్నా నివాళులు 
నవతెలంగాణ-వైరాటౌన్

సీపీఐ(ఎం) సానుభూతిపరులు మామిళ్ళ రంగా (హోటల్ రంగా) అనారోగ్యంతో శనివారం తెల్లవారుజామున మరణించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పాత సీపీఐ(ఎం) పార్టీ  కార్యాలయంలోని ఒక గదిలో మామిళ్ళ రంగా చిన్న టి స్టాల్ పెట్టుకుని జీవనం సాగించడంతో హోటల్ రంగా గా పేరు మారింది. సిపిఐ(ఎం) పట్ల అభిమానంతో పార్టీ చేపట్టిన అన్ని కార్యక్రమాల్లో రంగా కుటుంబం చురుకుగా పాల్గొంటున్నారు. రంగా భార్య సుగుణమ్మ కూడా పార్టీకి వీర అబిమాని. రంగా మరణ వార్త తెలియగానే సీపీఐ(ఎం)   రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భుక్యా వీరభద్రం, బొంతు రాంబాబు, వైరా సొసైటీ అధ్యక్షులు బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ముల్లపాటి సీతారాములు మామిళ్ళ రంగా భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వీరితో పాటు సీపీఐ(ఎం) వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, మండల కార్యదర్శివర్గ సభ్యులు బొంతు సమత, బాజోజు రమణ, తూము సుధాకర్, హరి వెంకటయ్య, షేక్ మజీద్, నూకల వెంకటేశ్వర్లు, యనమద్ది రామకృష్ణ, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు నివాళులు అర్పించారు.

Spread the love