శ్రమజీవు లకు అండగా సీపీఐ(ఎం) ఎజెండా: జిల్లా నాయకులు పుల్లయ్య

నవతెలంగాణ – అశ్వారావుపేట
శ్రమ జీవుల సిద్దాంతం అయిన మార్క్సిజం, లెనిన్నిజం పై ఆధారపడి భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్టు – సీపీఐ ఎం) పనిచేస్తుంది అని,ఇందులో పనిచేసే ప్రతి కార్యకర్త, సాదారణ సభ్యులు సైద్ధాంతిక స్థాయి కలిగి ఉన్నప్పుడే సమస్యలు పై ప్రజలను కదిలించకలుగుతారని పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య అన్నారు.  బుధవారం వినాయకపురం లో మండల కమిటీ ఆద్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న మండల స్థాయీ రాజకీయ శిక్షణా తరగతులు ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత బూర్జువా,పెట్టుబడి దారీ పార్టీల రాజకీయ నాయకులు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా అధికారం,హోదా,పదవులు కోసం ప్రజల సమస్యలు ను పక్కదారి పట్టిస్తున్నారు అని అన్నారు.పాలకులు అవలంబించే విధానాలు ధనవంతులు ను మరింత ధనికులు గా,పేదలను,మధ్యతరగతి ప్రజలు ను కడు పేదరికంలో నెట్టే విధంగా ఆ పార్టీల విధానాలు ఉంటున్నాయని వాపోయారు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కమ్యూనిస్టు సిద్దాంతం ప్రాముఖ్యత మరింత గా పెరిగింది అని,బూర్జువా సిద్దాంతం దాని మెస కారితనం క్రమంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అని అన్నారు.ఈ రెండు రోజులుపాటు బోదించే పార్టీ విధానాలు,సిద్దాంతాల ప్రాముఖ్యత ను విని అర్దం చేసుకొని ప్రజా సమస్యలు పై రాజీలేని పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.  మొదటి రోజు కులం,మతం, మతోన్మాదం అనే అంశాన్ని పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర సమన్వయ కర్త పిట్టల రవి బోధించారు.
ఆయన మాట్లాడుతూ..  దేశంలో మతం పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తూ తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం బిజెపి మత రాజకీయాలు చేస్తుందని విమర్శించారు.ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో ప్రజలపై దాడులు చేస్తుందని ప్రజల తినే ఆహారంపై నిబంధనలు విధిస్తూ ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కులను ధ్వంసం చేస్తుంది అన్నారు.భారత రాజ్యాంగం ప్రజలకు మత స్వేచ్ఛ ఇచ్చిందని దాని ప్రకారం ఎవరు ఏ మతంలో అయినా ఉండొచ్చని దాన్ని హరిస్తూ ఆర్ఎస్ఎస్ బిజెపి ఘర్ వాపస్ పేరుతో ఇతర మతాలపై దాడి చేస్తూ మత ఉన్మాదానికి పాల్పడుతుందన్నారు. లౌకికవాదం,ప్రజాస్వామ్యం సూత్రాలను ఉల్లంఘిస్తూ ఈ దేశ రాజ్యాంగాన్ని లెక్కచేయకుండా వాటికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ విశిష్టత అనే పాఠ్యాంశాన్ని రేపాకుల శ్రీనివాస్ బోధించారు.  ఈ క్లాసులు కు ప్రిన్సిపాల్ గా పిట్టల అర్జున్ వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బి.చిరంజీవి,గడ్డం సత్యనారాయణ,సూరిబాబు, మడిపల్లి  వెంకటేశ్వరరావు, సీతారామయ్య, గోవిందరావు, ప్రసాద్,జగన్నాథం, తదితరులు పాల్గొన్నారు.

Spread the love