సీపీఐ(ఎం) నాలుగ‌వ రాష్ర్ట బహిరంగ స‌భ.. బృందాకరత్ స్వీచ్

నవతెలంగాణ సంగారెడ్డి :
రాష్ట్ర మహాసభలకు వచ్చిన సోదర సోదరీమణులకు స్వాగతం అంటూ తెలుగులో మాట్లాడారు
– తెలంగాణ సాయుధ పోరాటంతో పేరు గాంచింది.
– నిజాముకు, బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఈ పోరాటం జరిగింది.
– ఆ పోరాటానికి గొప్ప చరిత్ర ఉంది.
– వారి త్యాగాలను, వారిచ్చిన జెండాను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది.
– ఈ గడ్డమీద నుంచి మాట్లాడుతున్నందుకు గర్వంగా ఉంది.
– ఈ మహాసభను కార్మికులు తమ సొంత డబ్బులతో నిర్వహించడం గొప్పగా ఉంది.
– కార్మికుల శ్రమతోని ఈ మహాసభలు జరుగుతున్నందుకు అభినందనలు.
– కార్మికులు, రైతులు కలిసి పోరాటం చేస్తనే నిలబడగలుగుతాం.. పెట్టుబడిదారీ వ్యవస్థను ఎదుర్కొనగలుగుతాం.
– దేశంలో కార్మికులను దోపిడీ చేయడం తీవ్రమవుతున్నది… పెట్టుబడిదారుల ఆస్తులు 400 రెట్లు ఆస్తులు పెరిగాయి.
– కార్మికులు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు.
– పదివేలు, 12 వేలతో కార్మికులు ఎలా జీవించగలుగుతారు. కనీస వేతనాలు ఎందుకు పెంచడం లేదు.
– ఈ ప్రాంతంలో నాలుగు వేల పరిశ్రమల్లో వలస కార్మికులు ఎక్కువగా పని చేస్తున్నారు.
– మోడీ ప్రభుత్వం అండతో పారిశ్రామిక వేత్తలు రోజుకు 13 గంటలు పనిచేయని కార్మికులపై ఒత్తిడి చేస్తున్నారు.
– కార్మికులు ఐఖ్యంగా ఉండి అనేక హక్కులను సాధించుకుంటున్నారు.
– కార్పొరేటర్లకు 3 లక్షల కోట్లు మాఫీ చేశారు.. అంగన్వాడి , ఆశా వర్కర్, భోజనం కార్మికులకు జీతాలు పెంచడంలేదు.
– నిత్యావసర ధరలు పెరుగుతున్న పట్టించుకోవడం లేదు.
– పేదలు, కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ఎదురు నిలబడి కొట్లాడుతున్నది ఎర్రజెండాలే.
– ఈరోజు రాజ్యాంగం స్థానంలో మనువాదాన్ని తేవాలని చూస్తున్నారు.
– దేశభక్తి నినాదాలు చేస్తుండొచ్చు గాని వారి హృదయాల్లో మనువాదం ఉంది.
– అంబేద్కర్ అవమానించిన అమీత్ షా రాజీనామా చేయాలి.. ఆయన గుండెలో అంబానీ, ఆదానీ ఉన్నారు.
– లోకికవాదం పైన, రాజ్యాంగం పైన, సామ్యవాదం పైన, వారికి విశ్వాసం లేని వారు నేడు దేశాన్ని పరిపాలిస్తున్నారు.
– ప్రజలను విభజించి పాలిస్తున్నారు. హిందూ-ముస్లిం, ఆదివాసి గిరిజన, దళితులు అని విభజన చేస్తున్నారు.
– విభజించి పాలించడం ప్రమాదకరంగా మారబోతున్నది.
– హిందూ ధర్మానికి, బీజేపీ చెబుతున్న హిందువులకు అసలు పొంతనలేదు.
– దేశానికి ప్రమాదం పొంచుకొస్తున్నది అందరం కలిసి పోరాటం చేద్దాం కలిసి రండి
– బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ఇండియా కూటమి ఏర్పాటు చేశాం.
– ఇండియా కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పాలన ఆదర్శంగా ఉండాలి.
– కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో ఐటీలో 12 గంటలు పనిచేయాలని ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ చెబుతున్న సనాతన ధర్మం కు వ్యతిరేకంగా పోరాడటం లేదు.
– పోరాటాన్ని ఆయుధంగా పలుకుని ముందుకు సాగాలి… ఇంక్విలాబ్ జిందాబాద్.. సిపిఐ(ఎం) జిందాబాద్..

Spread the love